ఇక విశ్రాంతి తీసుకుంటా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: మంత్రి ధర్మాన షాకింగ్ కామెంట్స్

‘ఇక చాలు.. రాజకీయాల నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకుంటా’ అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఆయన శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ.. తాను చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చానని, నాలుగు దశాబ్దాలపాటు కొనసాగానని పేర్కొన్నారు. ఇక విశ్రాంతి తీసుకుంటానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని సీఎం జగన్‌కు చెప్పానని తెలిపారు. పార్టీ కోసం పనిచేస్తాను కానీ ఎక్కువ కష్టపడలేనని, తనను వదిలేయాలని కోరానని అన్నారు. అయితే, జగన్ మాత్రం ఈ ఒక్కసారికి పోటీ చేయాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు.

తాను 12 సార్లు పోటీచేసి ఆరుసార్లు విజయం సాధించానని, గెలుపోటములతో పెద్దగా తేడా ఉండదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు ఆశీర్వదిస్తే గెలిచి మీ సేవకుడిగా ఉంటానని, ఓడిపోతే స్నేహితుడిగా ఉంటానని చెప్పారు. తనకు ఈ గౌరవం దక్కడానికి మీరే కారణమని, కాబట్టే ఈ విషయాలన్నీ మీతో చెబుతున్నానని ధర్మాన వివరించారు.

Dharmana Prasad
YSRCP
Srikakulam District

More Telugu News